LOADING...
Tollywood: దటీజ్ సూపర్ స్టార్..! కృష్ణ చేసిన సాహసానికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్
దటీజ్ సూపర్ స్టార్..! కృష్ణ చేసిన సాహసానికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్

Tollywood: దటీజ్ సూపర్ స్టార్..! కృష్ణ చేసిన సాహసానికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2026
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కొత్త సాంకేతికతలను పరిచయం చేయడంలోనూ, విభిన్న కథాంశాలను ఎంచుకోవడంలోనూ ఆయన ఎప్పుడూ ముందుండేవారు. జేమ్స్ బాండ్ శైలిలో సినిమాలు, సినిమాస్కోప్, కౌబాయ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. కృష్ణ అసలు పేరు శివరామకృష్ణమూర్తి కాగా, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరును 'కృష్ణ'గా మార్చారు. అక్కినేని నాగేశ్వరరావు ప్రభావంతో సినిమాల్లోకి వచ్చిన కృష్ణ, 1964-65 ప్రాంతంలో 'తేనెమనసులు' సినిమాతో హీరోగా పరిచయమై, గూఢచారి 116 ద్వారా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో 340-350కు పైగా చిత్రాలలో నటించారు.

వివరాలు

'సింహాసనం'తో సెన్సేషన్

1970లో పద్మాలయ సంస్థను స్థాపించి, 1983లో హైదరాబాద్‌లో పద్మాలయ స్టూడియోను నిర్మించారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. అలాంటి కృష్ణ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన సింహాసనం చిత్రం 1986 మార్చి 21న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో సంచలనాన్ని సృష్టించింది. జానపద చిత్రం తీయాలన్న తన చిరకాల కోరికను ఈ సినిమాతో నెరవేర్చుకున్నారు. ఆ రోజుల్లో రూ.50 లక్షల బడ్జెట్ కూడా పెద్ద విషయంగా భావించిన సమయంలో, ఈ చిత్రానికి కృష్ణ దాదాపు రూ.3.50 కోట్ల భారీ వ్యయం చేశారు. ఇతర నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో తన సొంత బ్యానర్ పద్మాలయ ఫిలింస్ ద్వారానే ఈ చిత్రాన్ని నిర్మించారు.

వివరాలు

ప్రేక్షకుల స్పందన, వసూళ్లు

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు కృష్ణే దర్శకత్వం వహించారు. హిందీ వెర్షన్‌లో ప్రముఖ నటుడు జితేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం, ఆ రోజుల్లో 'బాహుబలి' స్థాయి చిత్రంగా చెప్పుకునేంత అంచనాలను సొంతం చేసుకుంది. సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించేవి. ఇది ప్రేక్షకుల్లో ఉన్న అపారమైన ఆసక్తికి నిదర్శనం. జయప్రద, మందాకిని నటించిన ఈ చిత్రం పాటలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రం సుమారు రూ.7 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అప్పటి రికార్డులను తిరగరాసింది.

Advertisement

వివరాలు

అభిమానుల హంగామా

ఈ సినిమా వంద రోజుల వేడుకలు కూడా భారీగా నిర్వహించారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30,000 మంది అభిమానులు 400 బస్సుల్లో చెన్నైకి వెళ్లడం అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచింది. ఆ సమయంలో సూపర్ స్టార్ కృష్ణకు దాదాపు 2,500 అభిమాన సంఘాలు ఉండటం ఆయన క్రేజ్‌కు నిదర్శనం.

Advertisement