Loading...
RaviTeja - VivekAthreya : 'తులాభారం'లో రవితేజతో జతకట్టనున్న భామ.. విలన్‌గా సీనియర్‌ స్టార్‌?
'తులాభారం'లో రవితేజతో జతకట్టనున్న భామ.. విలన్‌గా సీనియర్‌ స్టార్‌?

RaviTeja - VivekAthreya : 'తులాభారం'లో రవితేజతో జతకట్టనున్న భామ.. విలన్‌గా సీనియర్‌ స్టార్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఇరుముడి' ఘనవిజయం తర్వాత మాస్‌ మహారాజా రవితేజ జోరు మరింత పెరిగింది. వరుస సినిమాలను జెట్‌ స్పీడ్‌లో పూర్తి చేస్తున్న ఆయన.. ఇప్పుడు టాలెంటెడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయతో కలిసి ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే వివేక్‌ ఆత్రేయ.. రవితేజతో చేయబోయే ఈ సినిమా కోసం భారీ కాస్టింగ్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటుల వివరాలు తాజాగా బయటకు రావడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన గ్లామరస్‌ బ్యూటీ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

కీలక పాత్రలో అనశ్వర రాజన్

అలాగే మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్‌ నటి అనశ్వర రాజన్‌ ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

వీరిద్దరి ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. బ్రిడ్జ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మేకర్స్‌ ఇప్పటికే ప్రత్యేక ఫొటోషూట్‌ కూడా నిర్వహించినట్లు సమాచారం.

అంతేకాకుండా ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం సీనియర్‌ నటుడు జేడీ చక్రవర్తిని పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వివరాలు

విజయదశమి సందర్భంగా షూటింగ్ ప్రారంభం

ఒకవేళ జేడీ చక్రవర్తి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఖరారైతే.. రవితేజ, జేడీ చక్రవర్తి మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో నెవర్‌ బిఫోర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

విజయదశమి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్‌ ప్రకటించనున్నారు.

కాగా, ఈ సినిమాకు 'తులాభారం' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT