Loading...
Regina Cassandra: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది: రెజీనా
ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది: రెజీనా

Regina Cassandra: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది: రెజీనా

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2026
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ప్రేమలో తీవ్రంగా మోసపోయానని, ఆ చేదు అనుభవం కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లానని ఆమె తెలిపారు. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'మూకుత్తి అమ్మన్ 2' (తెలుగులో 'మహాశక్తి') సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా తన గత ప్రేమ బంధం గురించి మాట్లాడారు.

వివరాలు

2020లో జీవితంలో ఊహించని ఘటన..

తన గత ప్రేమ బంధం గురించి రెజీనా మాట్లాడుతూ.. 2020లో తన జీవితంలో ఊహించని ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు.

తాను ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో ఆ బంధం ముగిసిపోయిందని తెలిపారు.

ఈ పరిణామం తనను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని, చాలా కాలం డిప్రెషన్‌తో బాధపడ్డానని భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు.

వివరాలు

మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం

ఆ కష్టకాలం నుంచి బయటపడేందుకు తనకు తానే సమయం కేటాయించుకోవడం ఎంతో సహాయపడిందని రెజీనా చెప్పారు.

ఇతరుల నుంచి ప్రేమను ఆశించే ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

జీవితంలో ఎదురయ్యే కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఆత్మవిశ్వాసం, స్వీయ ప్రేమ ఎంతో అవసరమని ఆమె సూచించారు.

ADVERTISEMENT

వివరాలు

యువతులకు రెజీనా కీలక సూచన

ముఖ్యంగా యువతులు లైంగిక వేధింపులు వంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నప్పుడు తమను తాము నిందించుకోవద్దని రెజీనా సూచించారు.

అలాంటి బాధాకరమైన అనుభవాలను మనసులోనే దాచుకోకుండా, నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలని తెలిపారు.

ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగాలని యువతులకు సలహా ఇచ్చారు.

తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకోవడం ద్వారా ఇతరులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు రెజీనా.

ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ADVERTISEMENT