Loading...
Chiranjeevi: మృత్యువుతో పోరాడి 174 మందిని కాపాడిన పైలట్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
మృత్యువుతో పోరాడి 174 మందిని కాపాడిన పైలట్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

Chiranjeevi: మృత్యువుతో పోరాడి 174 మందిని కాపాడిన పైలట్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2026
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

గాల్లో 30 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తోంది. అంతలోనే రెప్పపాటులో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఏం జరుగుతుందో ప్రయాణికులకు తెలిసేలోపే విమానం వేల అడుగుల కిందకు పడిపోతోంది. పక్కనే ఉండాల్సిన కో-పైలట్ ఉన్నట్టుండి విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కెప్టెన్ మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ధారగా కారుతున్నా.. శరీరం స్పృహ కోల్పోతున్న సమయంలోనూ, ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ ఆయన మాత్రం విమానం కంట్రోల్స్‌ను వదల్లేదు. కళ్లముందు కనిపిస్తున్న ప్రయాణికుల ఆర్తనాదాలు.. మరోవైపు మదిలో నిరంతరం మారుమోగుతున్న 'హనుమాన్ చాలీసా'.. ఇవే ఆయనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.

వివరాలు

174 మంది కాపాడారు

ఆంజనేయస్వామి నామస్మరణతో మృత్యువు అంచుల వరకు వెళ్లి కూడా ఒంటిచేత్తో 174 మంది ప్రాణాలను కాపాడిన ఆ రియల్ హీరో మరెవరో కాదు.. మన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్.

ఆకాశంలో చోటుచేసుకున్న ఈ అపూర్వ సాహసగాథ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్వయంగా స్పందించారు.

కెప్టెన్ స్మిత్ మచ్చార్ సాహసాన్ని ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటున్నాయి.

వివరాలు

హనుమాన్ చాలీసా జపిస్తూ ధైర్యం తెచ్చుకున్న కెప్టెన్

మరణం కళ్లముందు నర్తిస్తున్న సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ హనుమాన్ చాలీసా జపిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారన్న విషయం తెలుసుకుని తాను తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

ఈ మేరకు కెప్టెన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ చేశారు.

తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.

ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై కాపాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం.

ADVERTISEMENT

వివరాలు

మనోధైర్యాన్ని కోల్పోలేదు

ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది.

ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. జై హనుమాన్!" అంటూ చిరంజీవి ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

ADVERTISEMENT