RC 16: 'ఆర్‌సీ 16' పై వస్తున్న రూమర్స్‌పై స్పందించిన టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్‌సీ 16'. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహమాన్ వివరణపై చిత్రబృందం స్పందించింది.
ఏఆర్ రెహమాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగారని వస్తున్న వార్తలను ఫేక్ న్యూస్‌గా పేర్కొంది.
ఈ వార్తలపై టీమ్ స్పందిస్తూ, ఇలాంటి రూమర్స్‌ను నమ్మవద్దని, వాటిని షేర్ చేయవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.
ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ జనవరి 27 నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Details
రెండు పాటలు పూర్తి
మ్యూజిక్ వర్క్స్ ఇప్పటికే ప్రారంభమై, రెండు పాటలు కూడా పూర్తయ్యాయని ఏఆర్ రెహమాన్ ఐఫా అవార్డుల్లో వెల్లడించారు. బుచ్చిబాబు ఈ సినిమాకు దాదాపు రెండేళ్ల నుండి పని చేస్తున్నారు.
స్పోర్ట్స్ డ్రామాగా, గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం రామ్ చరణ్ కోసం పవర్‌ఫుల్ పాత్రను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.
కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.