
Gymkhana: 'తెలుగు సినిమాలు పట్టించుకోరు'.. హరీష్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళంలో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన 'అలప్పజ జింఖానా' చిత్రం తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే.
'జింఖానా' అనే పేరుతో ఈ సినిమా ఈ నెల 25న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించాడు.
జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
అయితే ఈ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
పక్క భాషల సినిమాలను ఎగబెట్టి చూసేందుకు పరుగెడతారు. కానీ తెలుగు సినిమాలైతే పట్టించుకోరా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Details
సినిమాకు భాషతో సంబంధం లేదు
నెటిజన్లు హరీష్ శంకర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. పక్క భాషల సినిమాలను రీమేక్ చేసే నువ్వు ఇలా మాట్లాడటం సరైంది కాదంటూ కొందరు విమర్శిస్తున్నారు.
మంచి సినిమా తీస్తే భాషా తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమా బాగా లేకపోతే మాత్రం ఎవరూ చూడరు. నువ్వు ఎవ్వరిని దూషించగలవని కొందరు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులే పక్క భాషల సినిమాలను కూడా హిట్ చేస్తారు. నువ్వు కూడా అదే ప్రేక్షకుల వల్లే హిట్ అయ్యావు. ఇప్పుడు వారినే తప్పుపడటం ఏమిటి? అంటూ హరీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాకు భాషతో సంబంధం లేదని, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తిస్తారని పలువురు స్పష్టం చేస్తున్నారు.