Chiru Leaks: 'కాకా'లో చిరంజీవి అసలు క్యారెక్టర్ ఇదే.. పేరు చెప్పేసిన మెగాస్టార్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కాకా'. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సూపర్‌హిట్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి చిరంజీవి స్వయంగా ఇచ్చిన కొన్ని హింట్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. పైకి కనిపించే రూపం ఒకలా ఉన్నా.. దాని వెనుక దాగి ఉన్న గతం మరోలా ఉంటుందనే విధంగా మెగాస్టార్ ఇచ్చిన లీక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన చిరంజీవి.. 'కాకా' సినిమాలో తన పాత్ర పేరు కదిరి కాళిదాస్అ ని వెల్లడించారు.
వివరాలు
బయట సత్యం.. లోపల కదిరి కాళిదాస్
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం అవుతున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాలో చిరంజీవి రెండు భిన్నమైన పార్శ్వాలు ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
బయటి ప్రపంచానికి చిరంజీవి పాత్ర 'సత్యం'గా కనిపిస్తుందని సమాచారం. ఒక సాధారణ ఆక్వా ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేసే సత్యం.. చూడటానికి అమాయకంగా, బాధ్యతగల సాధారణ పౌరుడిగా ఉంటాడట.
అయితే ఈ సత్యం వెనుక మరో చీకటి ప్రపంచం దాగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అదే 'కదిరి కాళిదాస్'. అండర్‌వరల్డ్‌ను శాసించే డాన్‌గా కదిరి కాళిదాస్ పాత్ర ఉండనుందని తెలుస్తోంది.
చిరంజీవి పాత్రలోని ఈ రెండు భిన్నమైన షేడ్స్ కథలో కీలకంగా మారనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివరాలు
తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధాన బలం?
ఈ డ్యూయల్ షేడ్ ట్రాక్ మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ అందించేలా ఉంటుందని అంటున్నారు. సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఈ అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ప్రచారం జరుగుతోంది.
యాక్షన్ అంశాలతో పాటు 'కాకా' కథకు తండ్రీకూతుళ్ల ఎమోషన్ అసలైన బలంగా నిలవనుందని సమాచారం. మలయాళ నటి అనస్వర రాజన్ ఇందులో చిరంజీవి కుమార్తె 'అమ్ములు' పాత్రలో కనిపించనుంది.
మెడిసిన్ చదివే తన కూతురి కోసం ప్రాణమిచ్చే తండ్రిగా చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.
తండ్రి, కూతురి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించేలా ఉంటాయని అంటున్నారు.
వివరాలు
భారీ బడ్జెట్‌తో 'కాకా'
అయితే అసలు అండర్‌వరల్డ్‌ను శాసించే కదిరి కాళిదాస్.. సాధారణ సత్యంగా ఎందుకు మారాడు? తన కూతురి కోసం మాత్రమే ఎందుకు సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు?
అనే సస్పెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం.
ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ మెగా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
'కాకా' చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.