LOADING...
Timothee Chalamet: 30 ఏళ్లకే మూడు ఆస్కార్‌ నామినేషన్లు.. ఎవరీ తిమోతి చాలమేట్‌?
30 ఏళ్లకే మూడు ఆస్కార్‌ నామినేషన్లు.. ఎవరీ తిమోతి చాలమేట్‌?

Timothee Chalamet: 30 ఏళ్లకే మూడు ఆస్కార్‌ నామినేషన్లు.. ఎవరీ తిమోతి చాలమేట్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

యావత్‌ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో 'ఆస్కార్‌' అగ్రస్థానంలో ఉంటుంది. ఆ అవార్డుకు నామినేషన్‌ దక్కినా గొప్ప గౌరవంగా భావించే నటులు, సాంకేతిక నిపుణులు ఎందరో. అలాంటిది హాలీవుడ్‌ యువ నటుడు తిమోతీ చాలమేట్‌ ఏకంగా మూడుసార్లు అకాడమీ అవార్డులకు నామినేట్‌ కావడం విశేషం. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించాడు. ఇటీవల ప్రకటించిన 98వ ఆస్కార్‌ నామినేషన్ల జాబితాలో 'మార్టీ సుప్రీం' చిత్రానికి గాను తిమోతీ ఉత్తమ నటుడి విభాగంలో చోటు దక్కించుకున్నాడు. దీనికితోడు గతంలో 'కాల్‌ మీ బై యువర్‌ నేమ్‌' (2017), 'ఏ కంప్లీట్‌ అన్‌నోన్‌' (2024) చిత్రాలకు కూడా బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో నామినేషన్‌ పొందాడు.

Details

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

టెలివిజన్‌ సిరీస్‌ 'హోమ్‌ల్యాండ్‌'తో తిమోతీ నట ప్రస్థానం మొదలైంది. 2014లో వచ్చిన 'మెన్‌, విమెన్‌ అండ్‌ చిల్డ్రెన్‌'తో సినీరంగంలోకి అడుగుపెట్టిన అతడు, 'ఇంటర్‌స్టెల్లార్‌'తో మరో మెట్టు ఎక్కాడు. రొమాంటిక్‌ డ్రామా చిత్రం 'కాల్‌ మీ బై యువర్‌ నేమ్‌' అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, క్రేజ్‌ తెచ్చిపెట్టింది. పలు విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులు సొంతం చేసుకున్న 'డ్యూన్‌' చిత్రంలో కథానాయకుడిగా నటించి మరోసారి తన స్థాయిని చాటుకున్నాడు. ప్రస్తుతం 'డ్యూన్‌ 3'లో నటిస్తున్నాడు.

Details

మార్చి 15న ఆస్కార్ వేడుక

ఆస్కార్‌తో పాటు బాఫ్టా, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌కు కూడా తిమోతీ నటించిన పలు సినిమాలు నామినేట్‌ కాగా, కొన్ని చిత్రాలు పురస్కారాలు కూడా గెలుచుకున్నాయి. తాజాగా 'మార్టీ సుప్రీం' చిత్రం బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ క్యాస్టింగ్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌, బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ వంటి కీలక విభాగాల్లోనూ నామినేషన్లు సాధించింది. 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక మార్చి 15న జరగనుంది.

Advertisement