Allu Arjun: చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు పీఎస్‌కు చేరుకున్న అల్లు అర్జున్‌ను, తొక్కిసలాట ఘటన అనంతరం వచ్చిన పరిణామాలపై పోలీసులు విచారిస్తున్నారు. గంటన్నర్నకుపైగా విచారణ కొనసాగుతోంది. అడ్వొకేట్ అశోక్ రెడ్డి, ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్‌ను ప్రశ్నిస్తున్నారు. విచారణలో, పుష్పరాజ్‌పై అనేక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
సీన్‌రీకన్‌స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్‌కు..
"తొక్కిసలాటలో రేవతి చనిపోయింది, ఆ విషయం మీకు థియేటర్‌లో ఉన్నప్పుడు తెలియదా?", "మీరు మీడియా ముందు ఎందుకు చెప్పలేదని చెప్పారు?", "రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా?", "అనుమతి లేకుండా ఎలా రోడ్ షో నిర్వహించారు?", "పోలీసులు రోడ్ షోకు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు?" వంటి ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. పోలీసులు అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. బన్ని సమాధానాలు కీలకంగా మారనున్నాయి. మరోవైపు, విచారణ తర్వాత అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లే యోచనలో పోలీసులు ఉన్నారు. అక్కడ సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు, థియేటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.