Loading...
Deva:ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

Deva:ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2026
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవా (75) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. దేవా మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సంగీత దర్శకుడిగా దేవా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన సినిమాలకు కూడా ఆయన సంగీతం అందించారు. తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు 400 సినిమాలకు స్వరాలు సమకూర్చారు.

వివరాలు

ప్రముఖుల సంతాపం

ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో 'గానా' సంగీత శైలికి విశేష గుర్తింపు తీసుకురావడంలో దేవా కీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలోనే ఆయనను 'గానా' జానర్‌ పితామహుడిగా గుర్తిస్తారు. తన సంగీతంతో దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరించిన దేవా మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా నిలవనుంది.

ADVERTISEMENT