అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకునే సమయం వచ్చేసింది. బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వచ్చేసారు.
అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు. మొదటి సీజన్ లో దుమ్ము దులిపి సక్సెస్ ఫుల్ గా రెండవ సీజన్ మొదలైంది. బాలయ్య పంచులు, నవ్వులు, అతిధులను ఆడించే ఆటలతో అన్ని షోలను పక్కకు నెట్టి అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.
మొన్నటికి మొన్న ఈ షోకి ప్రభాస్ వచ్చారు. ప్రోమో కూడా వదిలింది ఆహ. దాంతో అభిమానులందరూ ఆ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ వచ్చిన ఆనందాన్ని ఇంకా పూర్తిగా ఆస్వాదించకముందే పవన్ ని అతిధిగా తీసుకొచ్చారు.
పవన్ కళ్యాణ్
త్రివిక్రమ్ ఎక్కడ
ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో షూట్ జరుగుతున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ను స్వయంగా రిసీవ్ చేసుకున్నారు బాలయ్య. ఎన్ బీ కే వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా వేదికను రెడీ చేసినట్లు ఫోటోలు చూస్తే అర్థం అవుతోంది.
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులే కాదు అటు రాజకీయ నాయకులు కూడా అన్ స్టాపబుల్ నుండి వచ్చే పవన్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐతే ఈ షోలో త్రివిక్రమ్ కూడా ఉంటారని ఇంతకుముందు అనుకున్నారు. కానీ షూటింగ్ నుండి లీక్ అయిన ఫోటోల్లో త్రివిక్రమ్ కనిపించలేదు. మరి ఆయన వచ్చాడా లేదా తెలియాలంటే ప్రోమో వచ్చేవరకు ఆగాల్సిందే.