పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుండాలని ఉపాసన కీలక నిర్ణయం
రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం తమ ఇంటికి రాబోతున్న కొత్త మెంబర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో డెలివరీకి రెడీ అవుతోన్న ఉపాసన, తన బిడ్డ కోసం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత కార్డ్ బ్లడ్(బొడ్డు తాడు రక్తం) ని భద్రపరుచుకుంటానని వెల్లడిచేసింది. ఈ విషయాన్ని వివరిస్తూ, సోషల్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. భవిష్యత్తులో పుట్టిన బేబీకి ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే బొడ్డు తాడు రక్తం వల్ల పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.
జాబితాలో ముందున్న మహేష్ బాబు, నమ్రత దంపతులు
బొడ్డుతాడు రక్తాన్ని దాచుకోవడాన్ని స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటారు. స్టెమ్ సైట్ ఇండియా అనే సంస్థలో తనకు పుట్టబోయే బిడ్డ బొడ్డు తాడు రక్తాన్ని దాచుకుంటున్నట్లు ఉపాసన వెల్లడి చేసింది. ఉపాసన తీసుకున్న నిర్ణయానికి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశ్యంతో ఉపాసన వీడియో చేయడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియాలో స్టెమ్ సెల్ భద్రపరిచే సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో మహేష్ బాబు, నమ్రత దంపతులు తమ పిల్లల కార్డ్ బ్లడ్ ని భద్రపరిచారు.