NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వెంకటేష్ కొత్త సినిమా సైంధవ్ నుండి గ్లింప్స్ విడుదల
    సినిమా

    వెంకటేష్ కొత్త సినిమా సైంధవ్ నుండి గ్లింప్స్ విడుదల

    వెంకటేష్ కొత్త సినిమా సైంధవ్ నుండి గ్లింప్స్ విడుదల
    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 25, 2023, 01:28 pm 0 నిమి చదవండి
    వెంకటేష్ కొత్త సినిమా సైంధవ్ నుండి గ్లింప్స్ విడుదల
    శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ కొత్త సినిమా సైంధవ్

    విక్టరీ వెంకటేష్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ దొరికింది. వెంకటేష్, తన 75వ చిత్ర టైటిల్ ని ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ కూడా విడుదలైంది. "సైంధవ్" అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. "హిట్" ఫ్రాంఛైజీ దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజైన గ్లింప్స్ వీడియోలో, వెంకటేష్ చాలా మాస్ గా కనిపించారు. సీరియస్ లుక్ తో, చేతిలో గన్ పట్టుకుని నడుస్తూ బైక్ దగ్గర ఆగిపోయి, "నేనిక్కడే ఉంటానురా, ఎక్కడికెళ్ళను, రమ్మను" అనే వార్నింగ్ డైలాగ్ తో అదరగొట్టాడు వెంకటేష్. సైంధవ్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో విడుదల చేస్తున్నారు

    కొత్తరూటులో సాహసం చేస్తున్న వెంకటేష్

    జనరల్ గా వెంకటేష్ సినిమాల్లో వినోదం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య చేసిన సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నాడు వెంకీ. కానీ సైంధవ్ సినిమా మాత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. మాసిన గడ్డం, చేతిలో గన్ చూస్తే.. ఫ్యామిలీ సినిమాలను వదిలేసి యాక్షన్ రూట్ లోకి వెంకీ వెళ్ళిపోయాడని అర్థం అవుతోంది. సినిమా టైటిల్ లో కూడా యాక్షన్ అంశాలు కనిపిస్తున్నాయి. వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా వస్తున్న సైంధవ్ మూవీని నిహారికా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా వెల్లడి చేయలేదు కానీ మరికొద్ది రోజుల్లో షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    మార్చి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    అమరవీరుల దినోత్సవం 2023: సంవత్సరంలో రెండుసార్లు జరుపుకునే దీని ప్రత్యేకత మీకు తెలుసా? ముఖ్యమైన తేదీలు
    వన్డేల్లో 65 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ విరాట్ కోహ్లీ
    విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన విశాఖపట్టణం

    తెలుగు సినిమా

    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నో నో నో అంటూ అప్డేట్ ఇచ్చేసారు సినిమా
    బాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా? బాలకృష్ణ
    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు చిత్ర పరిశ్రమ
    అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు? సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023