NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Srikakulam Sherlockholmes: వెన్నెల కిషోర్ 'శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌' టీజర్‌ విడుదల
    తదుపరి వార్తా కథనం
    Srikakulam Sherlockholmes: వెన్నెల కిషోర్ 'శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌' టీజర్‌ విడుదల

    Srikakulam Sherlockholmes: వెన్నెల కిషోర్ 'శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌' టీజర్‌ విడుదల

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    01:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'.

    ఈ సినిమా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందించబడింది. రచయిత మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించాయి.

    పోస్టర్లు, పాటలు ఇప్పటికే మంచి స్పందనను తెచ్చుకోవడంతో పాటు సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించారు.

    తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో వెన్నెల కిషోర్ నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

    ప్రత్యేకంగా, ఈ టీజర్ మొత్తం శ్రీకాకుళం యాసలో ఉండటం ఆసక్తికరంగా మారింది.

    వివరాలు 

    అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వెన్నెల కిషోర్ స్క్రీన్ ప్రెజెన్స్ 

    వెన్నెల కిషోర్ ఆ యాసను బాగా హైలైట్ చేస్తూ, అద్భుతంగా ప్రదర్శించాడు.కథలో,పోలీసులకు కూడా చిక్కని పలు విషయాలను తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఛేదించే తీరు వినోదాత్మకంగా కనిపిస్తుంది.

    ఈ ప్రాసెస్ మొత్తం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

    ఇప్పటివరకు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'టీజర్ చూస్తుంటే ఈ సినిమా కూడా అదే కోవలో విజయాన్ని సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.

    ఇక టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీజర్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    టీజర్

    రంగబలి టీజర్: కామెడీ, యాక్షన్ కలయికతో సరికొత్తగా కనిపిస్తున్న నాగశౌర్య  తెలుగు సినిమా
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్
    రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ టీజర్: రణ్వీర్, ఆలియా ప్రధాన పాత్రల్లో ప్రేమకథ  బాలీవుడ్
    సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా?  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025