Page Loader
Vijay Devarakonda: నా సినిమాకు తారక్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం: విజయ్ దేవరకొండ 
నా సినిమాకు తారక్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: నా సినిమాకు తారక్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం: విజయ్ దేవరకొండ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ప్రేక్షకులు చాలా తెలివిగా మారిపోయారు. వారిని ఆకట్టుకోవడం చాలా కష్టం, స్టార్ హీరోలు కూడా ఈ సమయంలో తమ నటనతో అలరించేందుకు పలు మార్గాలు ప్రయత్నిస్తున్నారు. కానీ, చిన్న హీరోల పరిస్థితి మాత్రం కాస్త కష్టమే అని చెప్పాలి. వారు ఎన్నో ప్రయత్నాలు చేసినా, హిట్ సాధించడంలో విఫలమవుతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. అతను చివరిగా 'ఖుషి','ఫ్యామిలీ స్టార్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, తగిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో, ఈ సారి పెద్ద విజయం సాధించాలి అనే సంకల్పంతో 'కింగ్ డమ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుండి.. ఇటీవల విడుదలైన టీజర్ రౌడీ హీరో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

వివరాలు 

హిందీలో రణబీర్ కపూర్,తమిళంలో సూర్య టీజర్‌కు వాయిస్ ఓవర్

గౌతమ్, విజయ్‌ను కొత్త కోణంలో చూపించాడు.ఈ టీజర్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, విజయ్ దేవరకొండ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. "టీజర్ కోసం వాయిస్ ఓవర్ రాసినప్పుడు ఎన్టీఆర్ అన్నచెప్పితే బాగుంటుంది అనిపించింది. వెంటనే అదే విషయం ఆయనకు చెప్పగా,ఆయన వెంటనే ఒప్పుకున్నారు.ఈ సాయంత్రం చేసేద్దాం అన్నారు.దర్శకుడు చెన్నైలో ఉన్నారని,టీజర్‌కు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌లో బిజీగా ఉన్నారని చెప్పాం.'ఏం పర్లేదు, నువ్వు ఉన్నావు కదా'అని వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చారు.నా సినిమాకు తారక్ అన్నఈ రీతిగా వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం.హిందీలో రణబీర్ కపూర్,తమిళంలో సూర్య టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను" అని తెలిపాడు.