Puri Jagannath: పూరి చెప్పిన కథకు ఫిదా అయిన విజయ్ సేతుపతి.. త్వరలో షూటింగ్ స్టార్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి వినూత్న కథాంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
గతేడాది విడుదలైన 'మహారాజా' చిత్రంలో ఆయన నటనకు విశేషమైన ప్రశంసలు దక్కాయి. తాజా సమాచారం ప్రకారం, విజయ్ సేతుపతి దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పిన కథకు ఫిదా అయిపోయినట్లు తెలుస్తోంది.
పూరి జగన్నాథ్ చెప్పిన కాన్సెప్ట్‌లోని కొత్తదనం, తన పాత్ర డిజైన్ చేసిన విధానం ఆయనను బాగా ఆకట్టుకున్నాయి.
దీంతో విజయ్ సేతుపతి వెంటనే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
Details
ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో భారీ హైప్
కథపై విపరీతమైన ఆసక్తితో వెంటనే షూటింగ్‌ను ప్రారంభించాలని విజయ్ సేతుపతి పూరిని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇకపోతే, విజయ్ సేతుపతి ప్రస్తుతం 'ట్రెయిన్' అనే చిత్రంతో నటిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్‌తో సినిమా మొదలు కానుందని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబోపై ఇప్పటికే అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.