Vishwambhara Release Date : సమ్మర్ రేసు నుంచి 'విశ్వంభర' ఔట్..? మెగాస్టార్ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో మెగా అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ఈ భారీ హిట్‌తో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇదే జోష్ మెగాస్టార్ తదుపరి చిత్రం 'విశ్వంభర'కూ కొనసాగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌పై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ ఏర్పడింది. అయితే, ఈ సినిమా విడుదల తేదీపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది.
Details
సమ్మర్ రేసు నుంచి 'విశ్వంభర' ఔట్?
ఇప్పటి వరకు 'విశ్వంభర'ను సమ్మర్ రిలీజ్‌గా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సమ్మర్ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 'మన శంకరవరప్రసాద్ గారు' రిలీజ్ తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వడం మంచిదని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. అందుకే ఈ మూవీని సమ్మర్ అనంతరం జూలై 10న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Details
రిలీజ్ ఆలస్యం… కారణాలివే?
'విశ్వంభర' అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన లుక్స్, ట్రైలర్ ఫాంటసీ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ గూస్‌బంప్స్ తెప్పించాయి. అయితే, టీజర్‌లోని వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై కొన్ని విమర్శలు రావడంతో మేకర్స్ మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అదనపు సమయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే లక్ష్యంగా ఓ సరికొత్త ఫాంటసీ ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు టీమ్ కృషి చేస్తోంది. ఫైనల్ కాపీని మెగాస్టార్ చిరంజీవి చూసిన తర్వాతే రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్.
Details
స్టార్ క్యాస్ట్, టాప్ టెక్నికల్ టీమ్
ఈ సినిమాలో చిరంజీవి సరసన సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'స్టాలిన్' మంచి విజయాన్ని సాధించింది. అలాగే 'నా సామిరంగ' ఫేం ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్‌గా కనిపించనుంది. కునాల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తుండగా, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, సురభి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. మొత్తానికి, 'విశ్వంభర' రిలీజ్ ఆలస్యం అయినా.. మెగాస్టార్ ఫ్యాన్స్‌కు ఓ విజువల్ ట్రీట్ ఇవ్వడం మాత్రం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతోంది.