Page Loader
Aishwarya Rajesh : జర్నలిస్టును కొట్టిన ఐశ్వర్య రాజేష్.. అసలు ఏమైంది?
జర్నలిస్టును కొట్టిన ఐశ్వర్య రాజేష్.. అసలు ఏమైంది?

Aishwarya Rajesh : జర్నలిస్టును కొట్టిన ఐశ్వర్య రాజేష్.. అసలు ఏమైంది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 08, 2025
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

అదేంటి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒక జర్నలిస్టుని కొట్టడం ఏమిటి? అని మీకు అనుమానం కలగవచ్చు. అయితే ఆమె సీరియస్ గా కొట్టలేదు సరదాగా కొట్టారు. ఆమె వెంకటేష్ సరసన 'సంక్రాంతి వస్తున్నాం' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన గడుసు పెళ్ళాం పాత్రలో ఆమె కనిపించింది. ఎంత సేపు వెంకటేష్‌ని కొడుతున్నట్లుగా ప్రమోషన్ కంటెంట్‌లో కనిపించడంతో ఒక జర్నలిస్టు ఆమెను ఇదే విషయం ప్రస్తావించారు. మొన్న ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా వెంకటేష్‌ని కొట్టినట్టు ఉన్నారు కదా అని అడిగితే అవునని ఆమె సరదాగా కామెంట్ చేసింది. మిమ్మల్ని కూడా కొట్టాలా అంటూ వెంకటేష్‌ని జబ్బ మీద చరిచినట్టుగానే సదరు జర్నలిస్ట్ జబ్బ మీద కూడా చరిచారు.

Details

వెంకటేష్ సరసన హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్

అది కూడా సరదాగానే. దీంతో ఆ ఇంటర్వ్యూలో అంతా సందడి వాతావరణం నెలకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా నటించింది. ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తుండగా శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంక్రాంతికి గేమ్ చేంజెర్ సినిమా రిలీజ్ అవుతున్నా కూడా ఈ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్రొడక్షన్ ముందుకు వచ్చింది.