LOADING...
Ranveer Allahbadia: మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పిన యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియా 
మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పిన యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియా

Ranveer Allahbadia: మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పిన యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ రణవీర్‌ అల్హాబాదియా తన తప్పును సరిచేసుకున్నాడు. మహిళా దినోత్సవానికి ముందు కీలకమైన నిర్ణయం తీసుకుని, జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాస్తూ క్షమాపణలు తెలిపాడు. ఇకపై మహిళలను గౌరవిస్తానని, గతంలో జరిగిన ఘటనను మార్చలేనప్పటికీ భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటానని స్పష్టం చేశాడు. 'ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌' కార్యక్రమంలో రణవీర్‌ అల్హాబాదియా కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

వివరాలు 

రణవీర్‌పై సుప్రీం తీవ్ర ఆగ్రహం

సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ప్రజాదరణ ఉన్నవారు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని భావించరాదని, సమాజం అలా అనుమతించదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. దీంతో యూట్యూబర్‌ రణవీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని మాటలు మహిళా సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని, సమాజంలో విలువలకు ఒక పరిమితి ఉంటుందని, వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదేనని కోర్టు వ్యాఖ్యానించింది. వాక్స్వాతంత్ర్యం పేరుతో ఏదైనా మాట్లాడేందుకు సమాజం అనుమతించదని స్పష్టం చేసింది.

వివరాలు 

మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటా: రణవీర్‌

ఈ షోలో రణవీర్‌ అల్హాబాదియా ఉపయోగించిన భాష మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అతని మాటలు అశ్లీలత కాకపోతే మరేమిటని ప్రశ్నించింది. అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకూడదా? అరెస్ట్ చేయకూడదా? అని రణవీర్‌ తరఫు న్యాయవాదిని కోర్టు నిలదీసింది. అంతకంతకు పెరిగిన విమర్శలతో, మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు రణవీర్‌ అల్హాబాదియా క్షమాపణలు చెప్పాడు. ఇకపై తన మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటానని, మహిళలను గౌరవిస్తానని ప్రకటించాడు.