
Padma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం 2025 నాటి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాలలో అద్భుత సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో 7 మందిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కళల విభాగంలో ప్రముఖ సినీనటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం వరించింది
Details
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు
దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి (వైద్యం) తెలంగాణ జస్టిస్ జగదీశ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజా వ్యవహారాలు) చండీగఢ్ కుముదిని రజినీకాంత్ లాఖియా (కళలు) గుజరాత్ లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) కర్ణాటక ఎం.టి.వి. వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) కేరళ ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) జపాన్ శారదా సిన్హా (కళలు) - బిహార్
Details
పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు
నందమూరి బాలకృష్ణ (కళలు) ఆంధ్రప్రదేశ్ ఏ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) కర్ణాటక అనంత్ నాగ్ (కళలు) కర్ణాటక బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) ఎన్‌సీటీ దిల్లీ జతిన్ గోస్వామి (కళలు) అస్సాం జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) కేరళ కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) ఎన్‌సీటీ దిల్లీ మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) మహారాష్ట్ర నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) తమిళనాడు పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు)
Details
పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు1/2
కేరళ పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) గుజరాత్ పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) మహారాష్ట్ర రామ్‌బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) ఉత్తర్ ప్రదేశ్ సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) ఉత్తర్ ప్రదేశ్ ఎస్. అజిత్ కుమార్ (కళలు) తమిళనాడు శేఖర్ కపూర్ (కళలు) మహారాష్ట్ర శోభన చంద్రకుమార్ (కళలు) తమిళనాడు సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) బిహార్ వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికా
Details
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
జోనస్ మాశెట్టి (వేదాంత గురు) బ్రెజిల్ హర్వీందర్‌సింగ్ (పారాలింపియన్ గోల్డ్‌మెడల్ విన్నర్) హరియాణా భీమ్ సింగ్ భవేష్ (సామాజిక సేవ) బిహార్ పి. దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) పుదుచ్చేరి ఎల్. హంగ్‌థింగ్ (వ్యవసాయం-పండ్లు) నాగాలాండ్ బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) మధ్యప్రదేశ్ షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా) కువైట్ నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) నేపాల్ హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) హిమాచల్ ప్రదేశ్ జుమ్దే యోమ్‌గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త) - అరుణాచల్ ప్రదేశ్