Lpg cylinders: వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 3 వేల ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాయగఢ్ జిల్లాలో వరద ఉద్ధృతి కారణంగా పణ్వేల్ తాలూకాలో ఉన్న హెచ్‌పీసీఎల్ పాతాళగంగా ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో గ్యాస్‌తో నింపిన సిలిండర్లు, ఖాళీ సిలిండర్లు కలిపి సుమారు 3,000 ఎల్పీజీ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి పాతాళగంగా నదిలోకి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కిషన్ జవాలే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో లేదా నది తీర ప్రాంతాల్లో వరద నీటితో కొట్టుకొచ్చిన ఎల్పీజీ సిలిండర్లు కనిపిస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేశారు.
వివరాలు
అలా చేయడం ప్రమాదకరమని హెచ్చరిక..
అలాగే వాటిని ఇంటికి తీసుకెళ్లడం, తెరవడం లేదా ఉపయోగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఆ సిలిండర్లలో గ్యాస్ మిగిలి ఉందో లేదో, అవి సురక్షిత స్థితిలో ఉన్నాయో లేదో నిర్ధారించలేమని అధికారులు తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నదిలో, నది ఒడ్డున లేదా సమీప ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు కనిపించిన వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో..
Heavy rainfall in Maharashtra's Raigad flooded an LPG bottling plant, causing nearly 3,000 gas cylinders to be swept away into the Patalganga River pic.twitter.com/L9DHPDxsg3
— Dr. SP (@sphavisha) July 9, 2026