Loading...
Uttar Pradesh: యూపీలో భారీ వర్షాలు.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు
యూపీలో భారీ వర్షాలు.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

Uttar Pradesh: యూపీలో భారీ వర్షాలు.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మంగళవారం ఉదయం బహ్రాయిచ్‌ జిల్లాలోని కౌడియాల నదిలో వరదప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఐదు ఏనుగులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.ఏనుగుల గుంపు గిర్జాపురి బ్యారేజ్‌ వైపు కొట్టుకుపోతున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన కతర్నియాఘాట్‌ వన్యప్రాణి విభాగం అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఇదే సమయంలో నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజ్‌ గేట్లను మూసివేశారు. వరద ప్రవాహం తీవ్రత కొంత తగ్గిన తర్వాత అధికారులు ఐదు ఏనుగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.రక్షించిన ఏనుగుల్లో రెండు పిల్ల ఏనుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

33 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వీటిలో ఏడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరో 33 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

మంగళవారం ఉదయం నుంచే లఖ్‌నవూ, వారణాసి, అయోధ్య, ఝాన్సీతో పాటు పలు నగరాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యాయి.

భారీ వర్షాల నేపథ్యంలో 19 జిల్లాలకు వాతావరణ శాఖ వరద హెచ్చరికలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వరదలో చిక్కుకున్న ఐదు ఏనుగులు

ADVERTISEMENT