Indians In Russian Army: రష్యా సైన్యంలో చేరిన 227 మంది భారతీయులలో 51 మంది మృతి: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా సాయుధ దళాల్లో 227 మంది భారతీయులు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మరో 139 మందిని రష్యా సైన్యం విధుల నుంచి తొలగించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి వెల్లడించారు. రష్యా సైన్యంలో ఇంకా కొనసాగుతున్న భారతీయులను కూడా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి, స్వదేశానికి రప్పించేందుకు భారత్, రష్యా ప్రభుత్వాల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇరు దేశాల అధికారులు పరస్పరం చర్చలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
వివరాలు
మీడియాతో విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ
ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ పర్యటనకు సంబంధించిన అంశాలపై విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రష్యా సాయుధ దళాల్లో ప్రస్తుతం ఎంతమంది భారతీయులు ఉన్నారనే ప్రశ్న ఎదురైంది.
దీనికి సమాధానంగా ఆయన 227 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు తెలిపారు.
వారిలో 51 మంది మృతి చెందగా, 139 మందిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
మిగిలిన వారిని కూడా త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు రష్యాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.