తదుపరి వార్తా కథనం
Para Gliding: అరకు ఉత్సవాలకు ముందు పారా గ్లైడింగ్ ట్రయల్ విజయవంతం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 20, 2025
12:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
అరకులో ఈ నెలాఖరులో జరగనున్న అరకు ఉత్సవాల్లో పారా గ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ సమీపంలోని మాడగడ కొండపై ఆదివారం పారా గ్లైడింగ్ ట్రయల్‌రన్ విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గాలివాటం, వాతావరణ పరిస్థితులు, పరిసర ప్రాంతాల అనుకూలతలను సమీక్షించారు. ట్రయల్‌రన్ విజయవంతమైందని అధికారులు వెల్లడించారు.
ఈ ట్రయల్ విజయంతో పారా గ్లైడింగ్‌ను అరకు ఉత్సవాల్లో ప్రత్యేకంగా రూపొందించి సందర్శకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.