Page Loader
Praja Bhavan Accident: ప్రజాభవన్‌ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే 
Praja Bhavan Accident: ప్రజాభవన్‌ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే

Praja Bhavan Accident: ప్రజాభవన్‌ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే 

వ్రాసిన వారు Stalin
Dec 27, 2023
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

బేగంపేటలోని ప్రజాభవన్‌ ఎదుట మూడురోజుల కిందట కారుతో బారికేడ్లను ఢీకొన్న కొట్టి బీభత్సం సృష్టించిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ సమయంలో కొత్త కోణాలు వెలుగు చూస్తుండటం గమనార్హం. ప్రజాభవన్‌ ఎదుట కారు సృష్టించిన బీభత్సానికి బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇది వరకు ఈ కేసులో నిర్లక్ష్యం వహించారనే నెపంతో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావును సీపీ శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్ చేశారు. ప్రజాభవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొన్న కేసులో సొహైలే ప్రధాన నిందితుడని, విచారణను పక్కదారి పట్టించేందుకు తమ పనిమనిషిని స్టేషన్‌కు పంపారని పోలీసులు నిర్దారణకు వచ్చారు.

ప్రజాభవన్

ఈ కేసులో అసలేమైంది?

ఈనెల 23న అర్ధరాత్రి బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు సాహిల్‌ తన కారులో ముగ్గురు యువతులను కారులో ఎక్కించుకుని అతివేగంతో కారు నడుపుతూ.. ప్రజాభవన్‌ వద్ద ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టాడు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు..కారు నడిపిన సాహిల్‌ సహా ముగ్గురు యువతులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. బ్రీత్ ఎనలైజర్‌ పరీక్ష చేసే సమయంలో సాహిల్‌ను తప్పించుకొని పారిపోయాడు. వెంటనే సాహిల్ ఈ విషయాన్ని దుబాయ్‌లో ఉన్న తన తండ్రికి చెప్పారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన షకీన్ అనుచరులు సాహిల్‌ను తప్పించారు. ఆ కారు నడిపింది సాహిల్ పనిమనిషి అబ్దుల్‌ ఆసిఫ్‌ అని అతడిని 28వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఆసిఫ్‌‌పై కేసును నమోదు చేశారు.

ప్రజాభవన్

సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాక.. 

అయితే ప్రమాదం జరిగిన రోజు వాగ్మూలం ఇచ్చింది.. అబ్దుల్‌ ఆసిఫ్‌ కాదని పోలీసులు గుర్తించారు. ఆ రోజు కారు నడిపింది సాహిల్‌గా నిర్ధారించారు. డీసీపీ విజయ్‌కుమార్‌ మంగళవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బేగంపేట, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్లలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. ఈ మేరకు లభించిన సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించిన తర్వాత.. ఆ రోజు కారు నడిపింది సాహిల్‌గా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాహిల్‌ అని నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే, సాహిల్‌పై మరి కొన్ని కేసుల్లోనూ పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఆ కేసుల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.