Lisa: AI సృష్టించిన న్యూస్ యాంకర్‌ను పరిచయం చేసిన ఒడిశా న్యూస్ ఛానెల్
ఓటీవీ(OTV) అనే ఒడిశా ప్రైవేట్ శాటిలైట్ న్యూస్ ఛానెల్ సరికొత్త ఆవిష్కరణకు వేదిక అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సృష్టించిన పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ అయిన 'లిసా'ను ఆ ఛానెల్ పరిచయం చేసింది. AI సృష్టించిన న్యూస్ యాంకర్ లిసా ఒడిశా సంప్రదాయ చేనేత చీరను ధరించి అందరనీ ఆకట్టుకుంది. AI సృష్టించిన న్యూస్ యాంకర్ లిసా కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆధారంగా పని చేస్తుంది. ఓటీవీ నెట్‌వర్క్‌కు చెందిన, టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒడియా, ఇంగ్లీష్ రెండు భాషల్లో వార్తలను అందించేలా లిసా ప్రోగ్రామ్ తీర్చిదిద్దారు.
మార్చిలో భారత తొలి AI యాంకర్‌ను పరిచయం చేసిన ఇండియా టూడే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంలో ఓటీవీ లిసాను పరిచయం చేయడం అనేది టెలివిజన్ జర్నలిజంలో కీలక మైలురాయి అని చెప్పాలి. లిసా బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఒడియా, ఇంగ్లీష్ వార్తలు అందించడంపైనే ఓటీవీ దృష్టి పెట్టింది. టెలివిజన్ జర్నలిజంలో 25 సంవత్సరాలను జరుపుకున్న ఓటీవీ, ఒడిషా మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్‌ను పరిచయం చేసింది. మార్చిలో జరిగిన ఇండియా టుడే కాన్ఫరెన్స్ 20వ ఎడిషన్ సందర్భంగా భారతదేశపు మొదటి AI యాంకర్ సనాను ఆ సంస్థ వైస్-ఛైర్‌పర్సన్ కల్లి పూరీ ఆవిష్కరించారు.