హైదరాబాద్- దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు నేపథ్యంలో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులను దుబాయ్‌కి తరలించేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. బెదిరింపు మెయిల్ అక్టోబర్ 8న శంషాబాద్‌లోని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బీఎస్ఎన్ రెడ్డికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతి బాదినేనితో ఐఎస్‌ఐ ఇన్‌ఫార్మర్ అని, అతను విమానం హైజాక్ చేస్తాడని బెదిరింపు మెయిల్‌లో ఉంది. అనంతరం అప్రమత్తమైన విమానశ్రయ అధికారులు తిరుపతి బాదినేని, ఎల్.వినోద్ కుమార్, పి.రాకేష్ కుమార్‌లను పోలీసులకు అప్పగించారు. తిరుపతి బదినేనిని చూసేందుకు వచ్చిన మహిళను కూడా విచారించనున్నారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.