NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AndhraPradesh: వయసు చిన్నదైనా సాహసం పెద్దది.. ప్రాణం కాపాడిన పసివాడికి ప్రశంసల వెల్లువ
    తదుపరి వార్తా కథనం
    AndhraPradesh: వయసు చిన్నదైనా సాహసం పెద్దది.. ప్రాణం కాపాడిన పసివాడికి ప్రశంసల వెల్లువ
    AndhraPradesh: వయసు చిన్నదైనా సాహసం పెద్దది.. ప్రాణం కాపాడిన పసివాడికి ప్రశంసల వెల్లువ

    AndhraPradesh: వయసు చిన్నదైనా సాహసం పెద్దది.. ప్రాణం కాపాడిన పసివాడికి ప్రశంసల వెల్లువ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 19, 2023
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఓ బాలుడు సాహసం చేసి ప్రాణాన్ని కాపాడాడు.

    తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ఓ మహిళను రక్షించిన ఎనిమిదో తరగతి విద్యార్థి తెగువకు గ్రామస్థులతో పాటు అధికారులు ప్రశంసల వెల్లువెత్తిస్తున్నారు.

    కైకరంలో ఓ పక్క షష్టి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోపక్క సాయంత్రం 6 గంటల సమయంలో కైకరం గ్రామానికి చెందిన చిన్నమ్ములు అనే మహిళ ఏలూరు కాలువలో పడిపోయింది. ఈ మేరకు అక్కడే ఉన్న బాలుడు యశ్వంత్, ఈ ఘటనను చూశాడు.

    దీంతో క్షణం ఆలస్యం చేయకుండా కాలువలోకి దూకి ఆమెను పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు హుటాహుటిన ఒడ్డుకొచ్చిన చిన్నమ్ములను బయటకు లాగారు.

    details

    అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ఎనిమిదో తరగతి విద్యార్థి యశ్వంత్

    సమయస్ఫూర్తితో వ్యవహరించిన బాలుడి సాహసం ఆమె ప్రాణాలను రక్షించాయి. ఇదే సమయంలో చిన్నమ్ములు ప్రమాదవశాత్తు కాలువలో పడిందా లేక కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందా అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

    యశ్వంత్ స్థానిక కైకరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.యశ్వంత్'కు ఈతలో ప్రావీణ్యం ఉండటంతో కాలువలో కొట్టుకుపోతున్న మహిళను రక్షించి ప్రాణాలు నిలిపాడు.

    ఎవరికో ఏమైతే నాకెందుకులే అని స్వార్థంగా ఆలోచించకుండా గొప్ప మనసుతో ప్రమాదంలో ఉన్న మహిళ ప్రాణాలు రక్షించిన బాలుడ్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

    ఎన్నో సందర్భాల్లో మన కళ్లముందే ఎంతో మంది ప్రమాదాల బారిన పడిన క్రమంలో బాధితులకు సాయం చేయకుండా చాలా మంది చూసిచూడనట్టు వెళ్లిపోతుంటారు.అలాంటి వారిలో బాలుడు స్ఫూర్తిని రగిలించాడని గ్రామస్తులు కొనియాడారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు
    Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌! హరిహర వీరమల్లు
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Cm Jagan : సీఎం జగన్ సహా 41మందికి నోటీసులు..రఘురామ పిటిషన్ విచారణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Ap Caste Census : గ్రామ,వార్డు సచివాలయాలకు ఆదేశాలు..వారంలోగా కులగణన సర్వే పూర్తిచేయాలి భారతదేశం
    Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు విశాఖపట్టణం
    Ap Daikin AC : శ్రీసిటీలో డైకిన్‌ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025