Andhra Pradesh: ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలి.. పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలి నియమితులయ్యారు. ఆమెతో పాటు ఇప్పటివరకు పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. మరికొందరు అధికారులకు అదనపు బాధ్యతలు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సౌరభ్ గౌర్‌ను దిల్లీలోని ఏపీ భవన్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా డి.మురళీధర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా మంజులే బాలాజీ దిగంబర్‌ను నియమించారు. యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్‌గా కె.నీలకంఠారెడ్డిని ప్రభుత్వం నియమించింది.
వివరాలు
ఇతర శాఖల్లోనూ కీలక నియామకాలు
పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ శాఖల సంయుక్త కార్యదర్శిగా బి.అనిల్‌కుమార్‌రెడ్డికి అవకాశం కల్పించింది.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ఎన్.తేజ్‌భరత్‌ను నియమించింది.
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ ఉప కార్యదర్శిగా గేదెల శ్రీనుకుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
మరోవైపు ఎం.వరప్రసాద్‌కు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చింది.
వివరాలు
ఇతర శాఖల్లోనూ కీలక నియామకాలు
ఉద్యాన, సెరికల్చర్ డైరెక్టర్‌గా ఉన్న కె.శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న రవిసుభాష్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభమ్ బన్సల్‌కు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇప్పటివరకు ఈ బాధ్యతలను నిర్వహిస్తున్న ఎన్.యువరాజ్‌ను ప్రభుత్వం రిలీవ్ చేసింది.
తాజా ఉత్తర్వులతో పలు శాఖల్లో ఐఏఎస్ అధికారుల నియామకాలు, బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.