Page Loader
AP Liquor Shops Tenders: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువు పొడిగింపు..
ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువు పొడిగింపు..

AP Liquor Shops Tenders: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువు పొడిగింపు..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2024
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ (AndhraPradesh) ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూలును సవరించాలని పలువురు విజ్ఞప్తులు చేశారు. దసరా సెలవులు ఉండటంతో బ్యాంకులు పని చేయడంలేదని దరఖాస్తుదారులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మద్యం టెండర్ల షెడ్యూలులో మార్పులు చేసింది. ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 14వ తేదీన మద్యం షాపుల కోసం లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది.

వివరాలు 

ఒక్కో షాపుకు సగటున 15 దరఖాస్తులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 మద్యం దుకాణాలకు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. మంగళవారం నాటికి కర్నూలు, నంద్యాల జిల్లాలలో 2,503 దరఖాస్తులు అందాయి. కర్నూలు జిల్లాలోని 99 దుకాణాలకు 1,002 దరఖాస్తులు, నంద్యాలలోని 105 దుకాణాలకు 1,501 దరఖాస్తులు అందాయి. ఒక్కో షాపుకు సగటున 15 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మద్యం దుకాణాల లీజు కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం నూతన విధానం అమలు చేస్తోంది. ఈ షాపుల లీజుకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఒక్క వ్యక్తి అనేక దరఖాస్తులు చేయవచ్చు. దరఖాస్తు రుసుం రూ. 2 లక్షలు, లాటరీలో షాపు పొందని వ్యక్తికి కూడా ఈ మొత్తం తిరిగి చెల్లించబడదు.