Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ఏపీ సిద్ధం.. నేడు షెడ్యూల్,నోటిఫికేషన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి బుధవారం కీలక ప్రకటన వెలువడనుంది. ఎన్నికల షెడ్యూల్‌తోపాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా మంగళవారం లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు వివరించారు. ఎన్నికల కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి కూడా తెలియజేశారు. బుధవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు ఎస్ఈసీ పునేఠా షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయనున్నారు.
వివరాలు
రిజర్వేషన్లు ఇవే..
విశాఖ- బీసీ
తిరుపతి-ఎస్సీ మహిళ
ఎన్టీఆర్-ఎస్సీ
కృష్ణా- అన్రిజర్వ్డ్ మహిళ
ప్రకాశం-ఎస్సీ
నెల్లూరు-జనరల్
గుంటూరు-ఎస్సీ మహిళ
పల్నాడు-అన్రిజర్వ్డ్ ఉమెన్
తూర్పుగోదావరి- అన్రిజర్వ్డ్ మహిళ
కోనసీమ- ఎస్సీ మహిళ
పోలవరం-ఎస్టీ మహిళ
అల్లూరి-ఎస్టీ
అనకాపల్లి-బీసీ మహిళ
అనంతపురం-బీసీ
అన్నమయ్య- అన్రిజర్వ్డ్
బాపట్ల-అన్రిజర్వ్డ్ మహిళ
కాకినాడ- అన్రిజర్వ్డ్ మహిళ
కర్నూలు-బీసీ
మార్కాపురం- అన్రిజర్వ్డ్
నంద్యాల-అన్రిజర్వ్డ్
పార్వతీపురం మన్యం-ఎస్టీ
శ్రీసత్యసాయి-అన్రిజర్వ్డ్
శ్రీకాకుళం-బీసీ మహిళ
విజయనగరం-బీసీ మహిళ
పశ్చిమగోదావరి-అన్రిజర్వ్డ్
కడప-అన్రిజర్వ్డ్
చిత్తూరు-అన్రిజర్వ్డ్ మహిళ
ఏలూరు-అన్రిజర్వ్డ్ మహిళ