EVOI 2026: ఈవీఓఐ-2026లో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం..
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ఈజ్ ఆఫ్ వెహికల్ ఓనర్‌షిప్ ఇండెక్స్ (ఈవీఓఐ)-2026లో రాష్ట్రం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. పాత వాహనాల యాజమాన్య బదిలీల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వ్యవస్థాగత నిర్వహణ, సామర్థ్యం, వ్యయం, అందుబాటు వంటి ఆరు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేశారు. ప్రైవేట్ సంస్థలైన indiatech.org, కన్జ్యూమర్ వాయిస్ సంయుక్తంగా ఈ అవార్డును అందించాయి.
వివరాలు
హర్ష్ మల్హోత్రా చేతుల మీదుగా పురస్కారం
వాహనాల యాజమాన్య బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్రం అమలు చేస్తున్న వినూత్న విధానాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.
ముఖ్యంగా ధ్రువీకరణ ప్రక్రియను సరళతరం చేసే బయోమెట్రిక్ ప్రీ అథెంటికేషన్ విధానం ప్రశంసలు అందుకుంది.
దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా చేతుల మీదుగా ఏపీ భవన్ లైజన్ ఆఫీసర్ ప్రభాకర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.