LOADING...
PMGSY: గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఏపీకి దేశంలో రెండో స్థానం
గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఏపీకి దేశంలో రెండో స్థానం

PMGSY: గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఏపీకి దేశంలో రెండో స్థానం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద చేపట్టిన రహదారి నిర్మాణ పనుల్లో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుందని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ వెల్లడించారు. రాష్ట్రంలో నిరంతర సమీక్షలు నిర్వహించడం,క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించడం వల్ల ఈ ఘనత సాధ్యమైందని ఆయన తెలిపారు. గతంలో 2021-22లో కేంద్ర బృందం నిర్వహించిన అంచనాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 19వ ర్యాంకు మాత్రమే లభించిందని గుర్తుచేశారు.

వివరాలు 

రహదారి పనుల నాణ్యతను పరిశీలించిన పవన్ కళ్యాణ్

అయితే 2024-25, 2025-26 సంవత్సరాల్లో అత్యున్నత ప్రమాణాలతో గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వివిధ ప్రాంతాలకు వెళ్లి రహదారి పనుల నాణ్యతను పరిశీలించారని పేర్కొన్నారు. అదే సమయంలో నాణ్యత పర్యవేక్షణ కోసం క్వాలిటీ వింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, పనుల పురోగతిని రియల్ టైంలో నిరంతరం పర్యవేక్షించినట్లు వివరించారు. ఈ చర్యల ఫలితంగానే రాష్ట్రం దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకుందని కృష్ణతేజ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Advertisement