Loading...
Andhra Pradesh: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. పిడుగులతో కూడిన వానలు కురిసే ఛాన్స్
ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. పిడుగులతో కూడిన వానలు కురిసే ఛాన్స్

Andhra Pradesh: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. పిడుగులతో కూడిన వానలు కురిసే ఛాన్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ద్రోణి,ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం (అక్టోబర్ 14) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

పిడుగులు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగుల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు.

బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

ADVERTISEMENT