LOADING...
AP: సోలార్ సెల్ తయారీ యూనిట్ కోసం 34 ఎకరాల భూమి కేటాయింపు
సోలార్ సెల్ తయారీ యూనిట్ కోసం 34 ఎకరాల భూమి కేటాయింపు

AP: సోలార్ సెల్ తయారీ యూనిట్ కోసం 34 ఎకరాల భూమి కేటాయింపు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 12, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అనకాపల్లి జిల్లా పరవాడలో 3.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్ తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 34.02 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒక్కో ఎకరా ధరను రూ.65 లక్షలుగా నిర్ణయించి భూములు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌లో సంస్థ రూ.1,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దాని ద్వారా సుమారు 750 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

వివరాలు

మోండలెజ్ ఇండియా ఫుడ్స్ విస్తరణకు ప్రత్యేక ప్రోత్సాహకాలు..

తిరుపతి జిల్లా శ్రీసిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోండలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చాక్లెట్ తయారీ యూనిట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం టైలర్-మేడ్ ఇన్సెంటివ్స్ మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శనివారం జారీ అయ్యాయి. ఈ విస్తరణ ప్రాజెక్ట్‌లో కంపెనీ రూ.1,801 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దాని వల్ల 80 మందికి ఉపాధి లభించనుంది. అలాగే వచ్చే ఏడేళ్లలో టైలర్-మేడ్ ఇన్సెంటివ్స్ రూపంలో గరిష్ఠంగా రూ.565.88 కోట్ల వరకు సంస్థకు ప్రోత్సాహకాలు అందనున్నాయి.

వివరాలు

సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ యూనిట్‌కు టైలర్-మేడ్ ఇన్సెంటివ్స్..

కాకినాడలో ఎస్‌ఏఎఫ్ వన్ ఇండియా ఎస్పీకాంప్యాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ యూనిట్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు (టైలర్-మేడ్ ఇన్సెంటివ్స్) మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం సంస్థ రూ.1,356.22 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. యూనిట్ ప్రారంభం తర్వాత 100 మందికిపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. అదనంగా టైలర్-మేడ్ ఇన్సెంటివ్స్ కింద సంస్థకు గరిష్ఠంగా రూ.617.23 కోట్ల వరకు ప్రయోజనం లభించనుంది.

Advertisement