LOADING...
Chandrababu: 7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

Chandrababu: 7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్‌, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అమరావతిని క్వాంటమ్‌ వ్యాలీగా తీర్చిదిద్దడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం ఏడు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. రాష్ట్రంలో ఏఐ, క్వాంటమ్‌ అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంది.

Details

యూఎన్‌ఐసీసీతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్

క్వాంటమ్‌, ఏఐ రంగాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ స్థాపన కోసం యూఎన్‌ఐసీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ-క్వాంటమ్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం లక్ష్యం. దీన్ని ఏఐ-క్వాంటమ్‌ డిజిటల్‌ ఎంబసీగా అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో యూఎన్‌ఐసీసీ డైరెక్టర్‌ సమీర్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Details

లక్ష మందికి శిక్షణ: ఐబీఎంతో అవగాహన ఒప్పందం

రాష్ట్రంలోని లక్ష మంది యువతకు క్వాంటమ్‌, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి IBMతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఐబీఎం గ్లోబల్‌ డిజిటల్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించనున్నారు. కార్యక్రమంలో ఐబీఎం ఇండియా ఎండీ సందీప్‌ పటేల్‌, దక్షిణాసియా వ్యవహారాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిషోర్‌ బాలాజీ, రీసెర్చ్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్‌ అమిత్‌ సింఘీలు పాల్గొన్నారు.

Advertisement

Details

క్వాంటమ్‌ ఏఐ యూనివర్సిటీకి ఎన్‌ఐఈఎల్‌ఐటీతో ఒప్పందం

రాష్ట్రంలో క్వాంటమ్‌ ఏఐ యూనివర్సిటీ స్థాపన కోసం ఎన్‌ఐఈఎల్‌ఐటీతో ఒప్పందం కుదిరింది. దక్షిణ భారతదేశంలో తొలి ఏఐ-క్వాంటమ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతుల నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చగా, భూమి మరియు హార్డ్‌వేర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అమరావతిని క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో జాతీయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణను ఎన్‌ఐఈఎల్‌ఐటీ అమలు చేస్తుంది. కార్యక్రమంలో డైరెక్టర్‌ మదన్‌మోహన్‌ త్రిపాఠి, కంట్రోలర్‌ జనరల్‌ అలోక్‌ త్రిపాఠి పాల్గొన్నారు.

Advertisement

Details

భారత్‌ జెన్‌-నెక్స్ట్‌జెన్‌-ఐబీఎంలతో ఏఐ స్టాక్

రాష్ట్ర స్థాయి ఏఐ టెక్‌ హబ్‌, 5-లేయర్డ్‌ స్వదేశీ ఏఐ స్టాక్‌ నిర్మాణానికి భారత్‌జెన్, నెక్స్ట్‌జెన్, ఐబీఎంలతో ఒప్పందం కుదిరింది. ఈ సంస్థలు ప్రభుత్వ విభాగాలకు సాంకేతిక సేవలు అందించడంతోపాటు 22 భారతీయ భాషలను అనుసంధానించే ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తాయి. కార్యక్రమంలో భారత్‌ జెన్‌ సీఈఓ హృషికేశ్‌ మోహల్‌బాల్‌, నెక్స్ట్‌జెన్‌ సీఈఓ రాజగోపాల్‌, ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు.

Details

50 ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ విస్తరణ

కాలిబోతో ఒప్పందం రాష్ట్రంలోని 50 ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ, క్వాంటమ్‌ టెక్నాలజీ విస్తరణ కోసం కాలిబో AIతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏఐ అకాడమీ, ఏఐ శాండ్‌బాక్స్‌లు ఏర్పాటు చేసి డిగ్రీ, పీజీ విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఫ్యాకల్టీ అభివృద్ధి, ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌, పాఠ్యాంశాల రూపకల్పన, నైపుణ్య శిక్షణపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌ వట్టికూటి, అరబిందో సాహు, విపుల్‌ వలంజీ, పింటో జోయన్స్‌, జోహన్నెస్‌ ష్రోడర్‌లు పాల్గొన్నారు. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ స్థాపనకు Wiserతో ఒప్పందం కుదిరింది. ఈఏడాది చివరి నాటికి 3.50లక్షల మందిని, 2027 నాటికి 6లక్షల మందిని ఏఐ-క్వాంటమ్‌ అభ్యాసకులుగా తీర్చిదిద్దడం లక్ష్యం. కార్యక్రమంలో క్వాంటమ్‌ సొల్యూషన్స్‌ హెడ్‌ వర్ధన్‌ సెహగల్‌ పాల్గొన్నారు.

Details

ఏఐ ట్యూటర్‌ కోసం ఐఐటీ మద్రాస్‌తో అవగాహన

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల కోసం ఏఐ ట్యూటర్‌ను అందుబాటులోకి తేవడానికి IIT Madrasతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ కామకోటి, ప్రొఫెసర్‌ మితేష్‌ పాల్గొన్నారు. ఈ విధంగా క్వాంటమ్‌, ఏఐ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది.

Advertisement