
MEGA DSC: ఏపీ మెగా డీఎస్సీ 2025.. దరఖాస్తు చేసేముందు తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏప్రిల్ 20 నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అయితే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్య సమాచారం. తరచుగా వచ్చే ప్రశ్నల సమాధానాలను ఒకసారి పరిశీలిద్దాం. 1. భర్తీ చేయనున్న ఉపాధ్యాయ ఖాళీలు ఈ మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Details
2. యాజమాన్యాల విభజన
ఈ పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, జువనైల్ వెల్ఫేర్ విభాగాలు, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, బీసీ, ఎస్సీ, గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నాయి. 3. విభాగాల వారీగా ఖాళీలు ఎంపీ, జెడ్పీ, మున్సిపల్ - 13,192 ఏపీఎంఎస్ - 286 ఏపీఆర్ఈఐఎస్ - 190 ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ - 439 బీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ - 170 టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలు - 881 టీడబ్ల్యూ గురుకులం - 1,143 డిఫరెంట్లీ ఏబుల్డ్ - 31 జువనైల్ వెల్ఫేర్ - 15
Details
4. భర్తీ చేయనున్న పోస్టుల రకాలివే
సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, పీజీటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్‌లు. 5. అప్లికేషన్ ఫారమ్ నింపడంలో జాగ్రత్తలు మొత్తం మూడు విభాగాల్లో అప్లికేషన్ ఉంటుంది. వ్యక్తిగత సమాచారం, విద్యా అర్హతలు, ఫీజు చెల్లింపు. మొదటి రెండు విభాగాలను ఎడిట్ చేయవచ్చు. చివరి దశలో ఒక్కో పోస్టుకు రూ.750 చెల్లించాలి. మూడవ విభాగం ఎడిట్ చేయలేని దశ. 6. గత డీఎస్సీ అభ్యర్థులకు కొత్త ఫీజు అవసరమా? గత డీఎస్సీకి ఫీజు చెల్లించినవారు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అదనపు పోస్టులకు మాత్రం రూ.750 చొప్పున చెల్లించాలి.
Details
7. అప్లికేషన్ చివరి తేదీ
2025 ఏప్రిల్ 20 నుండి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 8. పూర్తిస్థాయి సమాచారం కోసం వెబ్‌సైట్స్ [https://cse.ap.gov.in](https://cse.ap.gov.in), [https://apdsc.apcfss.in](https://apdsc.apcfss.in) 9. టెట్ అర్హత మార్కులు ఓసీ: 60% (90 మార్కులు) బీసీ: 50% (75 మార్కులు) ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ: 40% (60 మార్కులు) 10. సర్టిఫికెట్లు ఎప్పుడు అప్లోడ్ చేయాలి? దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత తప్పనిసరిగా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. 11. రిజర్వేషన్ల అమలుపై స్పష్టత జీవో 77 ప్రకారం వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతాయి. హారిజాంటల్ రిజర్వేషన్లలో ముందుగా రోస్టర్ కేటాయింపు ఉండదు.
Details
12. మహిళల రిజర్వేషన్ ఎలా అమలవుతుంది?
హారిజాంటల్ రిజర్వేషన్ కింద 100 సైకిల్ మేరకు మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తారు. 13. పోస్టుల ఎంపిక సమయంలో ఆప్షన్ ప్రాధాన్యత సాఫ్ట్‌వేర్ అర్హతల మేరకు సూచించిన పోస్టుల నుండి అభ్యర్థి ఆప్షన్లను వరుసగా ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మార్పు చేసే వీలు లేదు. 14. మొదటి ఆప్షన్ రాకపోతే? మొదటి పోస్టుకు ఎంపిక కాకపోతే, అభ్యర్థి పేరు తరువాతి ఆప్షన్‌కు బదిలీ అవుతుంది. ఒక పోస్టుకు ఎంపికైతే మిగతా ఆప్షన్లు రద్దు. 15. వయోపరిమితి 01-07-2024 నాటికి వయస్సు 18-44 ఏళ్లు మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు గరిష్ఠ వయస్సు 49 ఏళ్లు. దివ్యాంగులకైతే 54, ఎక్స్ సర్వీస్ మెన్‌కు అదనపు సడలింపులు ఉన్నాయి.
Details
16. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 3 గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్ అమలుచేస్తారు. 17. స్పోర్ట్స్ కోటా అమలుపై స్పష్టత 3% పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తారు. 18. సందేహాల నివృత్తి కోసం ఎక్కడ సంప్రదించాలి? రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. 19. అత్యధిక పోస్టులు కలిగిన జిల్లా? కర్నూల్ జిల్లా - 2678 పోస్టులతో మొదటి స్థానం. శ్రీకాకుళం - 543 పోస్టులతో చివరి స్థానం. 20. సిలబస్ వివరాలు గత నవంబర్‌లోనే పోస్టుల వారీగా సిలబస్, మార్కుల వివరాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి.