Page Loader
AP News: కేంద్రమంత్రితో ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ భేటీ.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలక చర్చ 
కేంద్రమంత్రితో ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ భేటీ..

AP News: కేంద్రమంత్రితో ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ భేటీ.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలక చర్చ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం దిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విశాఖ,విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిపారు. విశాఖ,విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై త్వరిత నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడ మెట్రోను అమరావతితో అనుసంధానం చేయాలని ఆయన ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు కేంద్రమంత్రి ఖట్టర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.

వివరాలు 

మెట్రో ఎండీగా ఎన్‌పీ రామకృష్ణారెడ్డి

అమృత్ పథకానికి సంబంధించి కూడా కీలకమైన చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా ఖట్టర్‌ మెట్రో ప్రాజెక్టులపై తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ మెట్రో ప్రాజెక్టు టెండర్ల దశకు చేరుకుంది. కానీ తరువాత ప్రభుత్వం మారడంతో, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారు. భూసేకరణను కూడా గత ప్రభుత్వం ఉపసంహరించింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా, మెట్రో ఎండీగా ఎన్‌పీ రామకృష్ణారెడ్డిని నియమించారు. విజయవాడలో లైట్ మెట్రో ప్రాజెక్టుకు మళ్లీ ప్రతిపాదిస్తున్నారు. పీఎన్‌బీఎస్ ద్వారా ఒక కారిడార్ ఏలూరు రోడ్డులో, మరో కారిడార్ బందరు రోడ్డులో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం, సుదీర్ఘ పైవంతెనను ఎన్‌హెచ్ఏఐ నిర్మించనుంది. మెట్రో లైనుకు ఆటంకం లేకుండా ఆదిలోనే చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు.