Assam floods:58 మంది మృతి ,24 లక్షల మందికి పైగా నిరాశ్రయులు
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత 24 గంటలలో 52 మంది మృతి చెందగా, 24 లక్షలకు పైగా నిరాశ్రయులయ్యారు.
అస్సాంలోని 35 జిల్లాల్లో 30 జిల్లాలు వరదలకు ప్రభావితం అయ్యాయి. అస్సాంలో వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
వేలాది మంది గూడు లేక అల్లాడుతున్నారు. అస్సాంలో వరదలు రావడం ఇది రెండో సారి. వరదలకు చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి.
అస్సాంలో అనేక కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో జీవిస్తున్నారు. అనేక గ్రామాల్లో ఇళ్లు నీళ్లలో మునిగిపోయాయి. అస్సాంలోని బర్పేట జిల్లా చాలా దెబ్బతిన్నది.
వివరాలు
5,26,000 మంది నిరాశ్రయులు
1,40,000 మంది ప్రజలు ప్రభావితం అయ్యారు. కాగా,179 గ్రామాలు వరద నీళ్లలో మునిగిపోయాయి. 1571.5 హెక్టార్ల పంట నష్టం జరిగింది.
దుబ్రీ అనే మరో జిల్లా కూడా ఘోరంగా దెబ్బతిన్నది.బ్రహ్మపుత్ర నది నీరు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది.నీమతిఘాట్,తేజ్‌పూర్,ధుబ్రీ ,గోల్‌పరాలో బ్రహ్మపుత్ర మరో తొమ్మిది నదుల నీటి మట్టాలు ప్రమాద స్థాయిని మించి పెరిగాయి.
చాలా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ, నీరు నెమ్మదిగా తగ్గుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారని వార్తా సంస్థ ANI పేర్కొంది.
రాష్ట్రంలో 27 జిల్లాల్లో 577 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. వాటిలో ప్రస్తుతం 5,26,000 మంది ప్రజలు వాటిలో తలదాచుకుంటున్నారు. ఆహారం,ఇతర సహాయాల కోసం పంపిణీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు.