Badruddin Ajmal: 'అత్యాచారం, దోపిడీల్లో ముస్లింలు నంబర్ 1: అసోం నేత సంచలన వ్యాఖ్యలు
ముస్లింల గురించి అసోంకు చెందిన ఓ ముస్లిం నేత సంచలన ప్రకటన చేశారు. దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, జైలుకు వెళ్లడం వంటి నేరాలలో ముస్లింలు నంబర్ 1 అని ఆల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ పేర్కొన్నారు. బద్రుద్దీన్ ప్రకటనపై ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు. విద్య లేకపోవడం వల్లే ముస్లింల్లో నేరాల రేటు ఎక్కువగా ఉన్నట్లు అజ్మల్ చెప్పుకొచ్చారు. అజ్మల్ చెందిన ఏఐయూడీఎఫ్ పార్టీకి అసోంలో బెంగాలీ మాట్లాడే ముస్లింల్లో మంచి ఆదరణ ఉంది. 126మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో ఏఐయూడీఎఫ్‌కు 15మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
పురుషులతో అమ్మాయిలు మాట్లాడినప్పుడు తప్పుగా చూడొద్దు: అజ్మల్
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో విద్య లేదని బద్రుద్దీన్ అజ్మల్ ఆవేద వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవడం లేదని, మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయలేకపోతున్నారన్నారు. యువతకు విద్య ఎంత అవసరమో చెప్పడానికి తాను అలా వ్యాఖ్యానించినట్లు బద్రుద్దీన్ అజ్మల్ పేర్కొన్నారు. మగవారు, అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు తప్పుడు ఉద్దేశం ఉండకూడదన్నారు. ముస్లింల అభివృద్ధికి తక్కువ అక్షరాస్యత ప్రధాన అడ్డంకిగా మారిందని ఆయన అజ్మల్ అభిప్రాయపడ్డారు. విద్య విషయంలో తాము ప్రభుత్వాన్ని నిందిస్తామన్నారు. విద్య లేకపోవడం వల్ల మైనారిటీల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లను అందించలేమన్నారు.