LOADING...
Gang Rape: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. ప్రైవేట్ టీచర్‌పై గ్యాంగ్ రేప్, హత్య
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. ప్రైవేట్ టీచర్‌పై గ్యాంగ్ రేప్, హత్య

Gang Rape: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. ప్రైవేట్ టీచర్‌పై గ్యాంగ్ రేప్, హత్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

రోజు రోజుకు దేశంలో క్రూరమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు చేస్తున్న దుండగులపై ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే 45ఏళ్ల ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన వ్యక్తి రాజు వర్మ లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఎక్కించాడు. ఆమె స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు మధ్యలోని మసౌలీ సమీపంలోని కాలువ దగ్గరికి తీసుకెళ్లాడు.

Details

పోలీసుల అదుపులో నిందితులు

ఆ తర్వాత రాజు వర్మ తన స్నేహితుడు భూపేంద్రకు ఫోన్ చేసి, ఆమె మాటలు బయటకు రాకుండా గొంతులో గుడ్డలు నొక్కి ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేసి, శవాన్ని కాలువలో పడేశారు. కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. పోలీసుల విచారణలో ఆమె మృతదేహం కాలువలో లభ్యమైంది. పోలీసులు నిందితులు రాజు వర్మ, భూపేంద్రను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు.