హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు; భారీగా మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు స్వాధీనం
హైదరాబాద్‌లోని వట్టెపల్లిలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల సహకారంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని నితీష్, రాహుల్, సోహైల్‌గా గుర్తించారు. వీరి దగ్గరి నుంచి మొత్తం 400 ఇంజెక్షన్ వైల్స్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ మూలాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. జిమ్‌కు వచ్చే యువకులు తమ శరీరాన్ని ఒక్కసారికా పెంచుకోవాలనే అత్యాశతో మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను వినియోగిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. అయితే అక్రమ పద్ధతిలో వీటిని వాడటం వల్ల శరీరానికి హాని కలుగుతుందని చెబుతున్నారు.