Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి 101 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
101 kg of gold to Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిరం సోమవారం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.
రామమందిర నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తలు తమ శక్తికి మేరకు విరాళాలను అందజేశారు.
ఈ క్రమంలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి అయోధ్య రామాలయానికి అతిపెద్ద విరాళాన్ని అందించారు. రామాలయానికి 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.
ఆ దాత ఎవరో కాదు.. దిలీప్ కుమార్ వి.లఖి సూరత్‌లోని అతిపెద్ద డైమండ్ ఫ్యాక్టరీ యజమాని.
అతను రామాలయంలో అమర్చిన 14 బంగారు పూతతో ఉన్న తలుపుల కోసం 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.
రామజన్మభూమి ట్రస్ట్‌కి అందిన అతిపెద్ద విరాళం ఇదేనని నిర్వాహకులు చెబుతున్నారు.
అయోధ్య
రూ.3వేల కోట్లు దాటిన విరాళాలు
రామజన్మభూమి గుడి తలుపులు, గర్భగుడి, త్రిశూలం, స్తంభాలకు పాలిష్ చేయడానికి బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.
గర్భగుడి ప్రవేశ ద్వారంతో పాటు ఆలయ కింది అంతస్తులో 14 బంగారు ద్వారాలను ఏర్పాటు చేశారు.
రెండో అతిపెద్ద విరాళాన్ని మొరారీ బాపు అనుచరులు అందించారు. రామ మందిరానికి రూ.16.3 కోట్లు ఇచ్చారు.
ఇది కాకుండా, సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, ధోలాకియా శ్రీరామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ వ్యవస్థాపకుడు గోవింద్‌భాయ్ ధోలాకియా ఆలయానికి 11 కోట్ల రూపాయలను అందజేశారు.
మార్చి 2023నాటికి రామమందిరానికి రూ.3 వేల కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి.
ఆలయంలో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణానికి సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారు.
మిగతా పనులు పూర్తయ్యే వరకు దాదాపు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.