Loading...
Balapur Ganesh: పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో బాలాపూర్‌ గణపయ్య.. ఈసారి మరింత ప్రత్యేకం
పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో బాలాపూర్‌ గణపయ్య.. ఈసారి మరింత ప్రత్యేకం

Balapur Ganesh: పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో బాలాపూర్‌ గణపయ్య.. ఈసారి మరింత ప్రత్యేకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవాల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా పూరీ జగన్నాథస్వామి ఆలయం నిలవనుంది. బాలాపూర్‌ వినాయకుడిని ఈ ఏడాది పూరీ జగన్నాథ ఆలయ ఆకారంలో రూపొందించే మండపంలో కొలువుదీర్చనున్నారు. ప్రతేడాది దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆలయాల నమూనాల్లో బాలాపూర్‌ గణేశ్‌ మండపాన్ని ఉత్సవ నిర్వాహకులు ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు శ్రీశైలం, యాదగిరిగుట్ట, విజయవాడ కనకదుర్గ ఆలయం, అయోధ్య, అరుణాచలం, యాదాద్రి స్వర్ణగిరి ఆలయ నమూనాల్లో మండపాలను ఏర్పాటు చేశారు.

వివరాలు

ఆలయ ఆకారంలో మండపం

ఈ ఏడాది ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథస్వామి ఆలయ ఆకారంలో మండపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి శనివారం వెల్లడించారు.

దీంతో ఈసారి బాలాపూర్‌ గణనాథుడి మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది.

ADVERTISEMENT