LOADING...
Central Bank of India Recruitment : బ్యాంకు జాబ్స్ నోటిఫికేషన్.. 275 పోస్టులు, రూ.1.2 లక్షల వరకు జీతం
బ్యాంకు జాబ్స్ నోటిఫికేషన్.. 275 పోస్టులు, రూ.1.2 లక్షల వరకు జీతం

Central Bank of India Recruitment : బ్యాంకు జాబ్స్ నోటిఫికేషన్.. 275 పోస్టులు, రూ.1.2 లక్షల వరకు జీతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో నిపుణులైన అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 సంవత్సరానికి భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.

Details

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుకు చివరి తేదీ: 23 మార్చి 2026 ఆన్‌లైన్ పరీక్ష (తాత్కాలికంగా): ఏప్రిల్ 2026 ఇంటర్వ్యూ: ఏప్రిల్ 2026 ఖాళీల వివరాలు (పోస్టుల వారీగా) ఈ రిక్రూట్‌మెంట్‌లో ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఫైనాన్స్ విభాగాల్లో వివిధ పోస్టులు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలపర్ (Java) - 13 మొబైల్ డెవలపర్ (Android / iOS) - 3 సాఫ్ట్‌వేర్ డెవలపర్ (.NET) - 6 డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ - 11 డిజిటల్ ఛానల్ మేనేజర్ - 23 లినక్స్ / సోలారిస్ / స్టోరేజ్ / SRE - 14

Details

విండోస్ / యాక్టివ్ డైరెక్టరీ - 5

క్లౌడ్ మేనేజర్ - 5 ఇన్ఫర్మేషన్ / సైబర్ సెక్యూరిటీ - 38 నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ - 5 ప్రొడక్షన్ సపోర్ట్ / డిజిటల్ సపోర్ట్ - 26 క్లౌడ్ ఆర్కిటెక్ట్ - 6 DevSecOps - 4 వెబ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ - 3 డేటా ఆర్కిటెక్ట్ - 2 డేటా ఇంజనీర్ / ETL / PLSQL - 15 డేటా సైంటిస్ట్ - 6 Gen AI స్పెషలిస్ట్ - 2 ఐటీ ఆఫీసర్ - 82 రిస్క్ మేనేజర్ - 4 టాక్సేషన్ / సీఏ - 2

Advertisement

Details

అర్హత ప్రమాణాలు

విద్యార్హత ఐటీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఈసీఈ / ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బీఈ / బీటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. రిస్క్ మేనేజర్: రిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన డిగ్రీ ఉండాలి. టాక్సేషన్ / సీఏ: చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా టాక్సేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. వయోపరిమితి (గరిష్టం) స్కేల్ I: 30 సంవత్సరాలు స్కేల్ II, III: 35 సంవత్సరాలు స్కేల్ IV: 45 సంవత్సరాలు

Advertisement

Details

వయోసడలింపులు

ఎస్సీ / ఎస్టీ - 5 సంవత్సరాలు ఓబీసీ - 3 సంవత్సరాలు దివ్యాంగులు - 10 సంవత్సరాలు జీతభత్యాలు ఎంపికైన అభ్యర్థులకు బ్యాంక్ నిబంధనల ప్రకారం కింది వేతనాలు లభిస్తాయి స్కేల్ I (అసిస్టెంట్ మేనేజర్): రూ. 48,480 - రూ. 85,920 స్కేల్ II (మేనేజర్): రూ. 64,820 - రూ. 93,960 స్కేల్ III (సీనియర్ మేనేజర్): రూ. 85,920 - రూ. 1,05,280 స్కేల్ IV (చీఫ్ మేనేజర్): రూ. 1,02,300 - రూ. 1,20,940 ఇక‌ ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా అందుతాయి.

Details

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 1. Central Bank of India అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. 2. Specialist Officers Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేయాలి. 3. రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. 4. ఫొటో, సంతకం, అవసరమైన సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలి. 5. చివరగా ఫారమ్ సబ్మిట్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

Advertisement