Bharat Taxi Sarathi Didi : మహిళా డ్రైవర్లతో ప్రత్యేక సర్వీసు.. భారత్ టాక్సీ 'సారథి దీదీ' ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ టాక్సీ సహకార నిర్మాణం కింద 'సారథి దీదీ'తో సహా అన్ని డ్రైవర్లను వాటాదారులుగా (shareholders) భావిస్తుంది. అలాగే సార్ధీ దీదీ రైడర్లు కూడా వాటాదారులుగా మారవచ్చు. కంపెనీకి కీలకమైన నిర్ణయాలల్లో, డ్రైవర్లు ముందుగా జాయిన్ కావచ్చు, తమ అభిప్రాయాలను ఇవ్వగలరు. 'భద్రత మాత్రమే కాదు.. గౌరవం కూడా' భారత్ టాక్సీ మహిళా డ్రైవర్ల కోసం సారథి దీదీ అనే గౌరవప్రదమైన గుర్తింపును అందిస్తోంది. దీని ద్వారా మహిళలు ప్రయాణాల సమయంలో భద్రతతో పాటు విశ్వసనీయమైన సర్వీసును కూడా పొందవచ్చు. ఈ సర్వీసు ఇప్పుడు మహిళలతోపాటు పురుషులు కూడా ఉపయోగించవచ్చు.
Details
సారథి దీదీ సౌకర్యాలు
మహిళా డ్రైవర్ మాత్రమే
ట్రిప్ ట్రాకింగ్ సదుపాయం
ఎమర్జెన్సీ సపోర్ట్
24/7 కస్టమర్ సపోర్ట్
భారత్ టాక్సీ ఎలా పనిచేస్తుంది?
భారత్ టాక్సీ ఒక 'కో-ఆపరేటివ్ మోడల్'పై పని చేస్తుంది. ఇందులో డ్రైవర్ల ఆదాయంలో ఎలాంటి కమిషన్ ఉండదు; రైడర్లు కేవలం తమకు పడిన ఛార్జీని మాత్రమే చెల్లిస్తారు.
ఎక్స్-ట్రా ఛార్జీలు లేకుండా, ఆదాయం పూర్తిగా డ్రైవర్లకు చేరుతుంది. అలాగే, సరైన విచారణ లేకుండా ఏ అకౌంట్‌ను కూడా క్లోజ్ చేయడం జరుగదు అని కంపెనీ స్పష్టత ఇస్తోంది.
Details
సారథి దీదీ రైడ్ ఎలా బుక్ చేసుకోవాలి
1. లాగిన్ లేదా రిజిస్టర్ అవ్వండి
భారత్ టాక్సీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
2. పికప్ & డ్రాప్ లొకేషన్ ఎంటర్ చేయండి
మీ ప్రయాణం ప్రారంభ లొకేషన్ మరియు డిస్టినేషన్ ఎంటర్ చేయండి.
3. "సారథి దీదీ సర్వీసు" ఆప్షన్ ఎంచుకోండి
రైడ్ ఆప్షన్లలో మహిళల ప్రత్యేక సేవ అయిన 'సారథి దీదీ'ను సెలెక్ట్ చేయండి.
4. రైడ్ కన్‌ఫర్మ్ చేయండి
డ్రైవర్ వివరాలు, వాహన సమాచారం చూసి బుకింగ్ కన్‌ఫర్మ్ చేయండి.
5. సురక్షితంగా ప్రయాణించండి
మహిళా డ్రైవర్‌తో భద్రంగా మీ గమ్యానికి చేరుకోండి.