Loading...
AP MPTC, ZPTC Elections 2026: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు

AP MPTC, ZPTC Elections 2026: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఒకవైపు మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా నేటి నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అవసరమైన చర్యలు చేపట్టింది. అభ్యర్థులు ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు కల్పించింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది.

వివరాలు

25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

పరిశీలనలో తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అప్పీళ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది.

ఎంపీటీసీ నామినేషన్లకు సంబంధించిన అప్పీళ్లను ఆర్డీవో పరిశీలించనుండగా.. జడ్పీటీసీ నామినేషన్లకు సంబంధించి కలెక్టర్ అప్పీలేట్ అథారిటీగా వ్యవహరించనున్నారు.

ఈ నెల 26వ తేదీన అప్పీలేట్ అధికారులు అప్పీళ్లపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రచురించనున్నారు.

వివరాలు

ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

వచ్చే నెల 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.

అవసరమైన ప్రాంతాల్లో వచ్చే నెల 4వ తేదీన రీపోలింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు.

వచ్చే నెల 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడించనున్నారు.

ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.

ADVERTISEMENT