Page Loader
FDC : నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ జలుబు మాత్రలు వాడొద్దు.. ఆదేశాలిచ్చిన కేంద్రం
నాలుగేళ్లలోపు పిల్లల్లో జలుబు నివారణకు ఎఫ్‌డీసీ ఔషధాలు బ్యాన్ చేసిన కేంద్రం

FDC : నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ జలుబు మాత్రలు వాడొద్దు.. ఆదేశాలిచ్చిన కేంద్రం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 21, 2023
06:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాలుగేళ్లలోపు పిల్లల్లో జలుబు నివారణకు ఎఫ్‌డీసీ(Fixed Dose Combination)ఔషధాలు వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.ఈ మేరకు డీజీసీఐ(DGCI) ప్రకటన విడుదల చేసింది. నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో జలుబు నివారణ కోసం ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌(FDC)తో తయారైన ఔషధాల వినియోగాన్నికేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(CDSCO) నిషేధించింది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి(DGCI)ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది వినియోగదారులకు తెలిసేలా లేబుళ్లపై సమాచారాన్ని ముద్రించాలని ఔషధ తయారీ సంస్థలకు తెలిపింది. ఈ క్రమంలోనే డీజీసీఐ డైరెక్టర్‌ జనరల్‌(Director General)రాజీవ్‌ రఘువంశీ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్‌ కోకటే కమిటీ ఎఫ్‌డీసీని హేతుబద్ధమైన ఔషధంగా పేర్కొందని CDSCO స్పష్టం చేసింది.

DETALS

పిల్లలకు అవి హేతుబద్ధం కావని తేల్చిన నిపుణుల కమిటీ

కమిటీ సిఫార్సుల మేరకు 18 నెలల విధానపరమైన నిర్ణయంలో భాగంగా 2017 జులై 17 నుంచి ఎఫ్‌డీసీ ఔషధాల తయారీని కొనసాగించేందుకు అనుమతించామన్నారు. కానీ చిన్న పిల్లలకు ఎఫ్‌డీసీ వినియోగంపై ఆందోళనల నేపథ్యంలో, వీటిపై శ్వాసకోశ వ్యాధుల నిపుణుల కమిటీతో చర్చలు చేపట్టామన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో జలుబు నివారణ కోసం ఎఫ్‌డీసీ ఔషధాల వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. FDC అంటే.. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలిపి ఒకే ఔషధంగా ఆవిష్కరిస్తే, దానిని ఎఫ్‌డీసీగా పేర్కొంటారు. వీటివల్ల ప్రమాదం తలెత్తవచ్చని, 14రకాల ఎఫ్‌డీసీలపై గత జూన్‌లో కేంద్రం నిషేధం విధించింది.