Loading...
Rapthadu: రాప్తాడు బాలికపై దాడి కేసు.. ఉన్మాదిపై హేమంత్‌పై పోలీసుల కాల్పులు
రాప్తాడు బాలికపై దాడి కేసు.. ఉన్మాదిపై హేమంత్‌పై పోలీసుల కాల్పులు

Rapthadu: రాప్తాడు బాలికపై దాడి కేసు.. ఉన్మాదిపై హేమంత్‌పై పోలీసుల కాల్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడిచేసి పరారైన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆదివారం ఆత్మకూరు అడవిలో నిందితుడిని పట్టుకునే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను పోలీసులు ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. వైద్యులు అతడిని శస్త్రచికిత్స కోసం ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. జిల్లా ఎస్పీ జగదీశ్‌ ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు.

వివరాలు 

ఇనుప ముక్కతో రాప్తాడు సీఐ వెంకటేష్‌పై దాడి

నిందితుడి దాడిలో రాప్తాడు సీఐ వెంకటేష్‌ ఎడమ భుజం కింద గాయాలయ్యాయి.

మరోవైపు, రాయదుర్గం రూరల్‌ సీఐ వెంకటరమణ కిందపడటంతో శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి.

చికిత్స పొందుతున్న రాప్తాడు సీఐని ఎస్పీ జగదీశ్‌ పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

విద్యార్థినులు గోపిక, లక్ష్మిపై దాడిచేసి తప్పించుకుపోయిన హేమంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

నిందితుడు ఆత్మకూరు అడవిలో ఉన్నట్లు ఆదివారం సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారని చెప్పారు.

పొదల్లో దాక్కున్న హేమంత్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతడు ఇనుప ముక్కతో రాప్తాడు సీఐ వెంకటేష్‌పై దాడికి యత్నించాడన్నారు.

వివరాలు 

పోలీసుల చర్యలతో ఊరట

లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా నిందితుడు వినకపోవడంతో మొదట గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఎస్పీ వివరించారు.

అయినప్పటికీ హేమంత్‌ ఎదురుదాడికి దిగడంతో అతడి కాళ్లపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడి రెండు మోకాళ్ల కిందిభాగాల్లోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పారు.

దాడిలో గాయపడిన సీఐ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై బాలిక స్వగ్రామమైన అయ్యవారిపల్లిలో స్థానికులు స్పందించారు.

పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవడం తమకు ఊరటనిచ్చిందని తెలిపారు.

బాలికకు న్యాయం చేయాలని, విద్యార్థినుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

ADVERTISEMENT