Sanjeevani: జనవరి 1 నుంచి 'సంజీవని'.. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో 'సంజీవని' ద్వారా మంచి ఫలితాలు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అధికారులు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరించారు. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ, వ్యాధులను ముందుగానే గుర్తించడం, చికిత్స అందించడం, అనంతరం ఫాలోఅప్ సేవలకు ప్రాజెక్టులో ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేలా వ్యవస్థను రూపొందించాలని స్పష్టం చేశారు.
వివరాలు
వైద్య రంగంలో సమూల మార్పులు.. ప్రజల ఆరోగ్య డేటాకు భద్రత
డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసంధానిస్తూ 'సంజీవని' ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేస్తే వైద్య రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని సీఎం పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు విజయవంతంగా అమలై.. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్‌ను అనుసరించే స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
ప్రజల ఆరోగ్య సమాచారానికి సంబంధించిన గోప్యత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు.
వివరాలు
వైద్య రంగంలో సమూల మార్పులు.. ప్రజల ఆరోగ్య డేటాకు భద్రత
ప్రజలకు అవసరమైన ఆరోగ్య సమాచారాన్ని నేరుగా వారి మొబైళ్లకు హెల్త్ అప్డేట్స్ రూపంలో పంపించేలా ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి కుటుంబంపై వైద్యం, విద్యకు సంబంధించిన ఖర్చుల భారాన్ని తగ్గించడంతో పాటు.. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం, వాటి నివారణ, అవసరమైన చికిత్స అందించడం వంటి అంశాల్లో 'సంజీవని' ప్రాజెక్టు కీలకంగా ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.